Share News

వాహనాలతో పూడికతీత.. నిధులు ఆదా

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:14 AM

రామగుండం నగరపాలక సంస్థకు చెందిన వాహనాలతో ప్రధాన నాలాల్లో పూడిక తీయడం ద్వారా కోటి రూపాయల మేర ఆదా చేయడంతో పాటు డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు.

వాహనాలతో పూడికతీత.. నిధులు ఆదా

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థకు చెందిన వాహనాలతో ప్రధాన నాలాల్లో పూడిక తీయడం ద్వారా కోటి రూపాయల మేర ఆదా చేయడంతో పాటు డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు. డివిజన్‌ సందర్శనలో భాగంగా గురువారం 40వ డివిజన్‌లోని ప్రధాన నాలాల్లో పూడికతీత పనులను కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. గతంలో కార్పొరేషన్‌ పాలకులు, అధికారులు పూడికతీతకే కోట్ల రూపాయల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేవారని, పూడిక తీయకుండా రికార్డులు చేసుకుని నిధులు స్వాహా చేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నా రు. ఈసారి వేసవిలోనే ప్రధాన నాలాలు పూడికతీత పూర్తి కావాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆదేశించారని, ఈ మేరకు వాహనాలు, సిబ్బందితోనే పూడికతీత పూర్తి చేస్తున్నామన్నారు. ఉల్లిగడ్డల బజార్‌ నాలా పక్కన ఆక్ర మణలుచేసి భవనాలునిర్మించడం వలన పూడికతీత పనులకు ఆటంకం కలుగు తుందన్నారు. పూడిక తీయకపోతే వర్షాకాలంలో డ్రైన్‌ నీళ్లు ఇండ్లలోకి చేరుతుం దన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్తతొలగించే పనులకు మేయర్‌ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, అధికారులు శ్రమదానం చేశారు. సిబ్బందికి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. కార్పొరే టర్లు జయప్రద రాజేందర్‌, చిదురాల నాగరాజు, దూళికట్ట సతీష్‌, ముస్తాఫా, రమేష్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఈఈ రామన్‌, టీపీఎస్‌ నవీన్‌, డీఈ ఆప్తాబ్‌, జమీల్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 01:14 AM