బైపాస్ రోడ్డుకు భూములు ఇవ్వం
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:45 PM
పెద్దకల్వల నుంచి ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోతున్నాయని, పొలాలను ఇవ్వమని బాధితులు గురువారం అందోళన చేపట్టారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 25 (ఆంఽధ్రజ్యోతి): పెద్దకల్వల నుంచి ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోతున్నాయని, పొలాలను ఇవ్వమని బాధితులు గురువారం అందోళన చేపట్టారు. బాధిత రైతులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డుకు మొదట అనుకున్న రూట్‌ను మార్చి, తమ జీవనాధారమైన పంట పొలాలను రోడ్డు నిర్మాణంలో కలిపేందుకు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సర్వే చేసిన పాత స్థలం నుంచే బైపాస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించని పక్షంలో కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నాలు, రాస్త్తారోకోలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనకాడమని స్పష్టం చేశారు. రైతులు బొజ్జ సులోచన, కోట కొమురయ్య, కల్వల కుమారస్వామి, ఆర్నకొండ నరసయ్య, నాతరి భాగ్య, కలవల జయరాజ్, మిట్టపల్లి కనకయ్య, కల్వల విజయ్, కడారి రాజేశం, కడారి తిరుమల, కోట రాధిక, కల్వల అరుణ తదితరులు పాల్గొన్నారు.