Share News

సింగరేణి సమస్యలపై కేటీఆర్‌ నజర్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:18 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సింగరేణి కార్మిక సమస్యలపై దృష్టి సారించారు. ఈ నెల 5న హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ భవన్‌లో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జి లు, మాజీ మంత్రులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు.

సింగరేణి సమస్యలపై కేటీఆర్‌ నజర్‌

గోదావరిఖని, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సింగరేణి కార్మిక సమస్యలపై దృష్టి సారించారు. ఈ నెల 5న హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ భవన్‌లో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జి లు, మాజీ మంత్రులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. సింగరేణి సంస్థ, కార్మిక సమస్యలపై చర్చించి పోరాటాల రూపకల్పన చేయనున్నారు. ఈ నెల 11న గోదావరిఖనిలోని ఆర్‌జీ-1 జీఎం ఆఫీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు కేటీఆర్‌ హాజరుకానున్నారు. కార్యక్ర మాల విజయవంతానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శనివా రం సాయంత్రం గోదావరిఖని కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. సింగరేణి కార్మికుల మెడి కల్‌ బోర్డు నిర్వహణను వేగవంతం చేసి కార్మికులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించిన వాస్తవ లాభాల వాటాను కార్మికులకు అంద జేయాలని తీర్మానించారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ జెన్‌కో, ట్రాన్స్‌కోల నుంచి రావాల్సిన రూ.60వేల కోట్ల పెండింగ్‌ బకాయి లను విడుదల చేయాలని, సింగరేణి కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి మద్దతు తెలుపుతూ సమావేశం తీర్మానించింది. టీబీ జీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామమూర్తి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:18 AM