సింగరేణి కార్మికులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:52 PM
సిం గరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధిలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకే కేటీఆర్ అసంబద్ద విమర్శలు చేశాడని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
గోదావరిఖని, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): సిం గరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధిలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకే కేటీఆర్ అసంబద్ద విమర్శలు చేశాడని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కార్మిక సమస్యలను ఒక్కటి కూడా ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. సింగరేణిలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి రామగుండం అభివృద్ధిని చూపించేం దుకు బీఆర్ఎస్ శ్రేణులు చేసిన కార్యక్రమానికి ధన్యవాదాలని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మి కులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనలతో కేటీఆర్ మాట్లాడారన్నారు. లాభాల్లో 34శాతం వాటా, మారుపేర్ల సమస్య పరిష్కారానికి చర్యలు, సొంతింటి కలను నెర వేర్చేందుకు కృషి చూసి బీఆర్ఎస్ తట్టుకోవడం లేదన్నారు. కోల్బెల్ట్ ప్రాంత ప్రజల సొమ్మును సిద్ధిపేట, సిరిసిల్లా ప్రాంతాల అభివృద్ధికి దోచుకెళ్లారని, రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఎమ్మెల్యే విమర్శించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, నాయకులు, కార్పొరేటర్లు ముస్తాఫా, లింగస్వామి, రాజేష్, రాము, యుగంధర్, బాల రాజ్కుమార్, రాజిరెడ్డి, వడ్లూరి రవి, గట్ల రమేష్, కల్వల రంజిత్ పాల్గొన్నారు.