ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:21 AM
తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జి బీసీ అభివృద్ధి అదికారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలుశాఖల అధికారులతో కలిసి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జి బీసీ అభివృద్ధి అదికారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలుశాఖల అధికారులతో కలిసి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషిని నేటి యువతరం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం మంత్రి పదవిని వదులుకున్న గొప్ప దార్శనికుడని కొనియాడారు. బాపూజీ జయంతిని పురస్కరించుకొని పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. అధికా రులతోపాటు పద్మశాలి సంఘం నాయకులు, పాల్గొన్నారు.