దళితుడనే ఖర్గేను అవమానించారు
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:20 AM
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడనే అవమానించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ అంబెద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడనే అవమానించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ అంబెద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబెద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో దళితులు వివక్షకు గురవుతున్నారని. అవమానాలు. దాడులు హత్యలు జరుగుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా జలం కార్యక్రమానికి హాజరై వెళ్ళిన ఖర్గే కూర్చున్న స్థలాన్ని శుద్ధి చేయడం సిగ్గు చేటన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మెన్ నూగిళ్ళ మల్లయ్య, మందల సత్యనారాయణరెడ్డి, పాగాల శ్రీకాంత్, మొలుగూరి కమల్ కట్కూరి సత్యనారాయణరెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.