కల్యాణలక్ష్మి ప్రదాత కేసీఆర్
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:20 AM
రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక భరోసాను కేసీఆర్ కల్పించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ అన్నారు. శనివారం మహిళలు, బీఆర్‌ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటా నికి క్షీరాభిషేకం నిర్వహించి మాట్లాడారు.
గోదావరిఖని, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక భరోసాను కేసీఆర్ కల్పించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ అన్నారు. శనివారం మహిళలు, బీఆర్‌ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటా నికి క్షీరాభిషేకం నిర్వహించి మాట్లాడారు. ప్రతి పేదింటికీ సంక్షేమ ఫలాలు అందాలనే కేసీఆర్ ’కళ్యాణలక్ష్మి‘, ’షాదీ ముబారక్‘ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. గడిచిన పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16.78లక్షల పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మిద్వారా ఆర్థిక సాయం అందిందని తెలిపారు. అయితే, ప్రస్తుత పాలనలో రెం డున్నరేళ్లుగా కళ్యాణలక్ష్మి పథకం అమలు కాక పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు రావాల్సిన హక్కుల కోసం కోర్టును ఆశ్రయిం చినా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే నాథుడే కరువ య్యాడని విమర్శించారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.