కేసీఆర్ కట్టింది తుగ్లక్ ప్రాజెక్ట్
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:03 AM
కేసీ ఆర్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని, అది తుగ్లక్ ప్రాజెక్ట్ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం నర్సింగాపూర్, ఎర్రగుంటపల్లి, ధర్మారం గ్రామాల్లో పలు అభి వృద్ధి పనులకు భూమి పూజచేసి మాట్లాడారు.
ధర్మారం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కేసీ ఆర్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని, అది తుగ్లక్ ప్రాజెక్ట్ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం నర్సింగాపూర్, ఎర్రగుంటపల్లి, ధర్మారం గ్రామాల్లో పలు అభి వృద్ధి పనులకు భూమి పూజచేసి మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో 2 లక్షల ఎకరాల సాగు నీటి కోసం ప్రాణహిత ప్రాజెక్ట్ అవసరమని, కాకా వెంకటస్వామి రాజశేఖర్‌రెడ్డి ద్వారా అను మతులు ఇప్పిస్తే, కేసీఆర్ దాన్ని రీ డైజన్ చేసి తుగ్లక్ ప్రాజెక్ట్ కట్టారని మండిపడ్డారు. కేసీఆర్ స్వయంగా ఇంజనీర్ అవతరమెత్తి, అర్కిటెక్ టోపి పెట్టుకొని, తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో బ్యారేజీ కుంగుదలపై కేటీఆర్ అవగాహన లేక మాట్లా డుతున్నారని తెలిపారు. ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేస్తే తెలంగాణ ప్రాంతానికి ప్రాణనష్టం కలు గుతుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటి రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. 10 సంవత్స రాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, తెలంగాణ రైతులకు, యువకులకు తీరని ద్రోహం చేసిం దని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కట్టిన తుగ్లక్ ప్రాజెక్ట్ వల్లనే తెలంగాణకు కరువు వచ్చిందని, అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, బీఆర్‌ఎస్ తెచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి అభినందనీయమని చెప్పారు. శుక్రవారం నుంచి నూతన పెన్షన్ స్కీం అమలులోకి రావడం శుభప రిణామని సంతోషం వ్యక్తం చేశా రు. ధర్మపురి నియోజకవర్గానికి ఎంపీ నిధుల నుండి కోటి 20 లక్షల రూపాయల నిధులు కేటా యించినట్లు చెప్పారు. నర్సింగాపూర్‌లోని శివా లయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, బోర్‌వెల్ పనులకు భూమి పూజ చేశారు. ఎర్రగుంట పల్లిలోని దుర్గామాత ఆలయాన్ని దర్శించుకు న్నారు. ఆలయ అభివృద్ధికి 5 లక్షల రూపా యలు కేటాయించారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీలో 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాయకు లు కాడె సూర్యనారాయణ, బద్దం అజయ్‌పాల్ రెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, బద్దం సుధాకర్‌రెడ్డి, రాజేశం, సతీష్ గౌడ్, దేవి కిషోర్ పాల్గొన్నారు.