Share News

ఘనంగా కార్తీకపౌర్ణమి వేడుకలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:59 PM

కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళ వారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహిం చారు. తెల్లవారుజామునుంచే శివాలయాలు, వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్థానిక కోదండ రామాలయంలోని శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి.

ఘనంగా కార్తీకపౌర్ణమి వేడుకలు

కోల్‌సిటీటౌన్‌, నవంబరు 24 (ఆంధ్ర జ్యోతి): కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళ వారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహిం చారు. తెల్లవారుజామునుంచే శివాలయాలు, వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్థానిక కోదండ రామాలయంలోని శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. భక్తులు వేలాది సంఖ్యలో రావడంతో రామాలయం, శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈవో, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాల ప్రాంగణంలోని ఉసిరి చెట్లు, మారెడు చెట్లు, ధ్వజస్తంభాల ఎదుట భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. అర్చకులకు దీపదానాలు చేశారు. సాయం త్రం ఏడు గంటలకు జ్వాలాతోరణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ జ్వాలాతోరణాన్ని భక్తులు తిలకించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మనాలీ ఠాకూర్‌ దంపతులు పవర్‌హౌస్‌కాలనీలోని కాశీవిశ్వేశ్వరాలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ఆలయంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణాన్ని వెలి గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని ఆధ్యాత్మికంగా నడిపించే మాసమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 11:59 PM