Share News

పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:15 AM

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అండగా ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అ న్నారు. సోమవారం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి

ఎలిగేడు, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అండగా ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అ న్నారు. సోమవారం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ 2013-14లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కిరణ్‌ కుమా ర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. గతంలో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగించిందే తప్ప ఈ పథకం వారిది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎలిగేడు మండలంలో 12 సర్పంచ్‌ స్థానాలకు 11 మంది కాంగ్రెస్‌ వారే గెలవడం, సుల్తానా బాద్‌లో 13, పెద్దపల్లిలో 31 మంది అభ్యర్థులు రెబల్‌తో సహ గెల వడం తమ సంక్షేమాభివృద్ధికి, సీఎం రేవంత్‌ రెడ్డి పనితీరుకు నిదర్శన మన్నారు. సర్పంచ్‌లు కప్పల ప్రవీణ్‌, మారం కొమురయ్య, పల్లెర్ల వెంకటేష్‌, ఏలేటి వెంకట్‌రెడ్డి, రామిడి శైలజ, గోపు రజిత, దుగ్యాల వాణి, మద్దెల రమాదేవి, సిద్ది తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:15 AM