ప్రజల పక్షాల నిలిచిన కాళోజీ
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:17 AM
ప్రజా కవి కాళోజీ తన రచనల ద్వారా ప్రజల పక్షాన నిలిచారని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 9( (ఆంధ్రజ్యోతి): ప్రజా కవి కాళోజీ తన రచనల ద్వారా ప్రజల పక్షాన నిలిచారని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. తెలంగాణ యాస, భాషలలో రచనలు చేసి ప్రజా గొంతుకగా నిలిచారన్నారు. నా గొడవ వంటి రచనలు ఆయన ప్రజా చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయన్నారు. ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించిందన్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. అదనపు డీసీపీ (అడ్మిన్) ఏ శ్రీనివాస్, ఎస్‌బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు భీమేష్, శ్రీనివాస్, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాళోజీ జయంతిని నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు బాలసాని తిరుపతి, వడ్లూరి రవి, శంకర్‌నాయక్, కార్పొరేషన్ సెక్రటరీ మహేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఓ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు.