పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:31 PM
గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పిం చారు.
పెద్దపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పిం చారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు, జిల్లా అధ్యక్షుడు సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి రూ.26వేల కనీస వేతనం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీన గ్రీన్‌చానల్ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని, పంచాయతీ సిబ్బందిని రెండో పీఆర్సీలో గుర్తించాలని కోరారు. ఉద్యో గులకు ప్రత్యేక హోదాతోపాటు ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగురాల లచ్చయ్య, పైడిపల్లి నాగయ్య, జంగంపల్లి నరేష్, కునమల్ల అశోక్, రెడ్డిమల్ల నాగేశ్వర్, సహాయ కార్యదర్శులు దొంత కనుకయ్య, కోశాధికారి గౌసొద్దీన్, తిట్ల శ్రీనివాస్, ఆకుల నరేష్, సురేష్, నాయకులు బైరి శంకర్, తమ్మనవేని శంకర్, రాజేష్, భీమయ్య, దేవేందర్, చంద్రయ్య పాల్గొన్నారు.