జేబీసీసీఐ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:06 AM
సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున జేబీసీసీఐ కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి వెడ్డపల్లి కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
యైుటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున జేబీసీసీఐ కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి వెడ్డపల్లి కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023 డిసెంబరులో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయని, గుర్తింపు పత్రం రెండేళ్ళ కాలపరిమితికి జూలై 2024లో కార్మిక శాఖ ఇచ్చినట్టు తెలిపారు. అధికారికంగా ఈనెల 9తో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతున్న కారణంగా మైన్స్, సేఫ్టీ కమిటీ, నిర్మాణాత్మక సమావేశాలకు జేబీసీసీఐ ప్రాతినిధ్య సంఘాలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సర లాభాలను ప్రకటించి, వాస్తవ లాభాల్లో 40 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సర లాభాల్లో పక్కన పెట్టిన 4000 కోట్ల సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని సింగరేణిని డిమాండ్ చేశారు. 11వ వేజ్‌బోర్డు జూన్ నాటికి ముగిసిందని, 12 వేజ్‌డోర్డు కమిటీ ఏర్పాటుకు సింగరేణి కృషి చేయా లన్నారు. వేజ్‌బోర్డు వేతన ఒప్పందాలు జరిగే వరకు కార్మికు లకు ఇంటీరియం రిలీ ఫ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉం డవన్నారు. సీపీ ఆర్‌ఎస్ ట్రస్టులో 120 కోట్ల నిధులు ఉన్నాయని, సింగరేణిలో ఆన్‌రోల్ కార్మికుల సంఖ్య తక్కువగా ఉండి రిటైర్డ్ కార్మికులు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అరుకల ప్రసాద్, నాయకులు శివాజీ, మడికంటి శ్రీనివాస్, లింగం నాయక్, పాక కృష్ణ, రమేష్, సంతో ష్ పాల్గొన్నారు.