Share News

జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:09 AM

జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలి

గోదావరిఖని, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): జేబీసీసీఐ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 9, 10 తేదీల్లో ఒడిశాలోని తాల్చేర్‌ అంగూల్‌ ప్రాంతంలో అఖిల భారతీయ ఖాఽథాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ 113వ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగిందని, దేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమల్లో యాజమాన్యాలు కార్మికుల సమస్యలపై నియంతృత్వ ధొరణిని అభిలంభిస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. 11వ వేజ్‌బోర్డు జేబీసీసీఐ ఒప్పందంలో కార్మికులకు ఏ-1 గ్రేడుల్లో అధికారుల కంటే ఎక్కువ వేతనం ఉందనే కారణంతో హైకోర్టులో కేసులు వేశారన్నారు. కార్మికుల సంక్షేమ పథకాలు, సెలవులు, ప్లేడేలు, పబ్లిక్‌ హాలీడేలు ఇతర అంశాలపై కోతలు విధించడం అన్యాయమన్నారు. సింగరేణి బొగ్గు గని కార్మికులకు జూలైలో 12వ వేతన సవరణ ప్రారంభమవుతుందని, ఇప్పటి వరకు కమిటీ వేయలేదన్నారు. నాయకులు సారంగపాణి, మాదాసి రవీందర్‌, ఆకుల హరి, లక్ష్మయ్య, కోటయ్య, గట్టయ్య, ప్రసాద్‌, సమ్మయ్య, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:09 AM