అందరికీ సమానత్వం అందించిన జగ్జీవన్‌రామ్
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:14 AM
అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సోమవారం కొత్తూర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ధర్మారం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సోమవారం కొత్తూర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా పనిచేశారని అన్నారు. మాజీ ఉప ప్రధానిగా విశేష సేవలందించారని గుర్తుచేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ శిథిలావస్థలో ఉన్నందున దానిని తొలగించి అందరికి ఉపయోగపడేలా మినీ ఫంక్షన్ హాల్ నిర్మించుకోవాలని, అందుకు రూ.25 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి కార్యక్రమానికి హాజరై పూజలు చేశారు. గ్రామంలోని ఉప ఆరోగ్య కేంద్రం వద్ద డ్రైనేజీ లేక మురుగు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, డీసీసీ సెక్రెటరీ కొత్త నర్సింహులు సర్పంచ్ సంగీత, ఉప సర్పంచ్ సామల నాగభూషణం, వార్డు మెంబర్లు, అంబేడ్కర్ సంఘ అధ్యక్షులు నెరువట్ల రాజయ్య, గుల్లకొల్ల లింగమూర్తి, నెరువట్ల మహేందర్, చొప్పదండి మల్లేశం, కాంపెల్లి పోచయ్య పాల్గొన్నారు.