వన మహోత్సవానికి వేళాయే!
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:43 AM
వన మహోత్సవానికి వేళయింది. వర్షాకాలం ఆరంభం అయ్యిందంటే మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుం దని భావిస్తున్న ప్రభుత్వం యేటా జూన్, జూలై మాసాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 27 లక్షల 58 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వన మహోత్సవానికి వేళయింది. వర్షాకాలం ఆరంభం అయ్యిందంటే మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుం దని భావిస్తున్న ప్రభుత్వం యేటా జూన్, జూలై మాసాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 27 లక్షల 58 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 8 లక్షల మొక్కలను ఇళ్లల్లో నాటుకునేందుకు పంపిణీ చేయనున్నారు. మిగతా మొక్కలను నాటేందుకు 28 ప్రభుత్వ శాఖల విభాగాలకు లక్ష్యాలను విధించారు. ప్రధానంగా అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలను నాటాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అడవుల శాతం తగ్గడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నది. దీంతో సకాలంలో వర్షాలు పడక కరువుఛాయలు కమ్ముకున్నాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత యేటా వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడాలంటే పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హరితహారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు 2015 నుంచి మొక్కలు నాటడడం ఆరంభించారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలు నాటేందుకు కావాల్సిన గుంతలను తవ్వించి మొక్కలు నాటుతున్నారు. దీంతో రాష్ట్రంలో, జిల్లాలో అడవుల శాతం పెరగడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం ఆరంభమయ్యాయి. అంతేగాకుండా పర్యావర ణం కూడా పెరుగుతున్నది. మొక్కల పెంపకానికి గత ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘హరితహారం’ పేరును ‘వన మహోత్సవం’గా మార్చారు.
ఫ జిల్లాలో 260 గ్రామాల్లో నర్సరీలు..
ప్రతి గ్రామం, పట్టణంలో వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా, ఖర్చు ఆదా చేసేందుకు నాటి ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకున్నది. జిల్లాలో 260 నర్సరీలను ఏర్పాటు చేశారు. వాటిని గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. ఇవేగాకుండా అటవీ శాఖ ద్వారా కూడా 20కి పైగా నర్సరీలు ఉన్నాయి. వీటిలో నీడనిచ్చే మొక్కలతో పాటు జామ, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు, గులాబీ, గన్నేరు, మందార, తదితర పూల మొక్కలను పెంచుతున్నారు. జిల్లా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు అందుబాటులో ఉన్నాయని డీఆర్‌డీఓ, అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 70 వేల వరకు కూలీలు గుంతలు తవ్వి మొక్కలు నాటేం దుకు సిద్ధం చేశారు. ఈసారి గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గాను 3 వేల ఈత మొక్కలు, 420 తాటి మొక్కలను నాటాలని నిర్ణయించారు. మొక్కలను ఈ నెల 18వ తేదీ నుంచే నాటాలని ప్రభుత్వం నిర్ధేశించి నప్పటికీ, జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో మొక్కల కార్యక్రమాన్ని ఆరంభించ లేదు. రెండు, మూడు రోజులపాటు వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటాలని కలెక్టర్ నిర్ణయించారు.
ఫ ఆయా శాఖల వారీగా మొక్కలు నాటాల్సిన లక్ష్యం
------------------------------------------------------------
1. అటవీ శాఖ 85,000
2. ఆర్‌టీసీ 500
3. పంచాయతీరాజ్ 5,000
4. డీఆర్‌డీఓ 14,20,000
5. నీటి పారుదల శాఖ 20,000
6. వ్యవసాయ శాఖ 1,00,000
7. మార్కెటింగ్ 500
8. ఉద్యాన శాఖ 1,000
9. ఎక్సైజ్ శాఖ 4,000
10. దేవాదాయ శాఖ 500
11. మున్సిపల్ శాఖ 6,50,000
12. పోలీస్ శాఖ 10,000
13. అగ్నిమాపక శాఖ 100
14. ఇంటర్ కళాశాలలు 1,000
15. యూనివర్శిటీ 3,400
16. జిల్లా విద్యా శాఖ 3,000
17. పశుసంవర్థక శాఖ 200
18. పరిశ్రమల శాఖ 4,50,000
19. వైద్య ఆరోగ్య శాఖ 500
20. విద్యుత్ శాఖ 200
21. ఐఈడీఎస్ శాఖ 500
22. ఎస్సీ సంక్షేమ శాఖ 500
23. బీసీ సంక్షేమ శాఖ 500
24. గిరిజన సంక్షేమ శాఖ 300
25. మైనార్టీ సంక్షేమ శాఖ 200
26. యువజన, క్రీడలు 100
27. రైల్వే శాఖ 500
28. ఇతర శాఖలు 500
------------------------------------------------------------
మొత్తం 27,58,000
------------------------------------------------------------