సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్ పార్టీనే
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:28 AM
సింగ రేణి సంస్థను నాటి నుంచి కాపాడింది కాంగ్రె స్ పార్టీనేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల జిల్లాలోని సిం గరేణి గనుల ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన పలు ఆరోపణలను, విమర్శలను మంత్రి శ్రీధ ర్‌బాబు పరోక్షంగా తిప్పికొట్టారు.
మంథని, జాన్ 20 (ఆంధ్రజ్యోతి): సింగ రేణి సంస్థను నాటి నుంచి కాపాడింది కాంగ్రె స్ పార్టీనేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల జిల్లాలోని సిం గరేణి గనుల ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన పలు ఆరోపణలను, విమర్శలను మంత్రి శ్రీధ ర్‌బాబు పరోక్షంగా తిప్పికొట్టారు. క్యాంపు ఆఫీ సులో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సీఎం ఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వచ్చి వారు తమపై రాజకీయ విమర్శలు చే యడం హాస్యాస్పదమన్నారు. బీఆర్‌ఎస్ కుటుం బంతో విబేధించి బయటకు వచ్చిన వారు 10 సంవత్సరాల పరిపాలనలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నప్పటికీ ఏమి చేయ కపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. వారు మాట్లాడుతున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరు
సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఉద్యమ సమయంలో తనను మంథని ప్రాంతంలో ఓడించా మని గొప్పలు చెప్పుకుంటున్న వారికి తిరిగి అదే ప్రజలు తనను రెండు సార్లు ఆశీర్వదించారన్నారు. ఆలోచన లేకుండా కొంత మంది మాట్లాడుతుంటే జాలి కల్గుతుందన్నారు. తాను ఎప్పుడు ఎవరి పై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, అలాంటి సమయం కూడా తనకు లేదన్నారు. తన సమయాన్ని ప్రజలకు మేలు చేసే పనులకు కేటాయిస్తామన్నారు. మంథని పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయటానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు వెడల్పులో నష్ట పోయే వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంథని అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చామన్నారు. మహిళలకు ఉపాధి కల్పించడానికి కుట్టు శిక్షణ కేం ద్రాన్ని, యువతకు ఉపాధి కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసుకుం టున్నారన్నారు. వీటి పై కొందరు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోమన్నారు. ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, ఈఆర్‌సీ మెంబర్ శశిభూషన్ కాచే, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌లు పాల్గొన్నారు.