Share News

మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:32 PM

ప్రజా సమస్యలను పరిష్కరించ డం మంత్రిగా తన బాధ్యతని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం చామనపల్లిలో ముంపు బాధితులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి మాట్లాడారు. మీరు ఓట్లేసి గెలిపించి నన్ను మంత్రిని చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతి క్షణం కృషి చేస్తారని తెలిపారు.

మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత

ధర్మారం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను పరిష్కరించ డం మంత్రిగా తన బాధ్యతని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం చామనపల్లిలో ముంపు బాధితులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి మాట్లాడారు. మీరు ఓట్లేసి గెలిపించి నన్ను మంత్రిని చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతి క్షణం కృషి చేస్తారని తెలిపారు. కాళ్వేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా మేడారంలో నంది రాజర్వాయర్‌ నిర్మాణం చేపట్టిన ప్పుడు, చామనపల్లి ముంపునకు గురైందని, అప్పటి బీఆర్‌ఎస్‌ పాలకులు ముంపు గ్రామాల ప్రజలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చామనపల్లికి చెందిన సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి పేర్కొన్నారు. ముంపు బాధితులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైతే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. గురువారం చామనపల్లిలో ప్రత్యేక కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులు పర్యటిస్తారని, గ్రామస్తులు సహకరించా లని కోరారు. అనంతరం గ్రామంలోని ముంపు పరిస్థితిని పరిశీలించారు.

ఈవీఎం ఓటింగ్‌ బలైన మొదటి వ్యక్తిని తానే...

తెలంగాణలో ఈవీఎం ఓటింగ్‌కు బలైన మొట్టమొదటి వ్యక్తి తానేనని మంత్రి అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఎన్నికల్లో కౌంటింగ్‌ హాల్‌ నుంచి 30 నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చేసరికి ఫలితాలను తారు మారు చేశారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఓటు చోరీ జరుగుతుందని రాహుల్‌గాంధీ నిరసన వ్యక్తం చేస్తుంటే, దేశం, ధర్మం కోసం అంటూ బీజేపి నాటకాలు ప్రదర్శిస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఎన్నికల కమి షన్‌ చేపట్టిన సర్‌ ప్రక్రియ లోపభూయిష్టమైందని, బీజేపి వ్యతిరేక ఓట్లను తొలగించేందుకే కేంద్ర ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ను అడ్డం పట్టుకొని బీజేపీ ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ఈఈ రాం ప్రసాద్‌, డీఈలు నర్సింగారావు, విష్ణు ప్రసాద్‌, తహసీ ల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ వేల్పుల రేవతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చింతల ప్రధీప్‌రెడ్డి, మండల అధ్యక్షులు లావుడ్య రూప్లా నాయక్‌, ద్యాగేటి ఉదయ్‌, వేల్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:32 PM