Share News

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:42 PM

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్‌ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

గోదావరిఖని, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్‌ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ గడిచిన రెండేళ్లలో సాధించిన లాభాల నుంచి యాజమాన్యం దాచిపెట్టిన రూ.6వేల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. దాచిన డబ్బు నుంచి అధికారులకు చెల్లించవలసిన రూ.230 కోట్ల పీఆర్‌పీని వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ డిమాండ్‌ చేశారు. కోల్‌ ఇండియాలో అమలవుతున్న జీతభత్యాలను తక్షణమే సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి వారి స్వలాభాన్ని చూసుకుంటున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల న్యాయమైన పోరాటానికి మద్దతు ఇస్తున్నామని టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి అన్నారు. తక్షణమే అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే అధికారులు చేపట్టే ప్రతి పోరాటానికి బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ ముందుంటుందన్నారు. టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1, 2 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్‌, ఐలి శ్రీనివాస్‌, కేంద్ర నాయకులు జాహిద్‌ పాషా, పోలాడి శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఐ సత్యం, బేతి చంద్రయ్య, ఎం రాజేశం, అంజయ్య, రాజు, భాస్కర్‌, రవి, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:42 PM