Share News

బీఆర్‌ఎస్‌ నేతలను కాపాడేందుకే ముందుకు సాగని విచారణ

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:09 AM

బీఆర్‌ఎస్‌ నాయకులను కాపాడేందుకే బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరి పించేందుకు కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్రానికి పంపిస్తే కేసు ముందుకు సాగడం లేదన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలను కాపాడేందుకే    ముందుకు సాగని విచారణ

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నాయకులను కాపాడేందుకే బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరి పించేందుకు కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్రానికి పంపిస్తే కేసు ముందుకు సాగడం లేదన్నారు. గురువారం మండల కేంద్రంలో మడిపల్లి కాలనీ, పెగడపల్లి, గంగారం, పందిల్ల, లక్ష్మీపురం, ఇప్పలపల్లి, తారుపల్లి, మీర్జంపేట, కాల్వశ్రీరాంపూర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్‌ఎస్‌ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారని, కోర్టు తీర్పులో కమిటీ వేయడంలో ప్రభుత్వం తప్పు లేదని పేర్కొన్నట్లు తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం వద్ద బుంగలు పడిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కృంగిన విషయంపై అక్కడికి ఎవరిని పోకుండా పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేసిందని, అది ప్రజలందరికి తెలుసని గుర్తుకు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. మెదక్‌ జిల్లా మల్లన్న సాగర్‌, కొండ పోచమ్మ రిజర్వాయర్‌ కట్టుకొని ఇక్కడి నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశార న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలోనే శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు కట్టడంతో పాటు వరద కాలువలు తమ ప్రభుత్వమే తవ్వించిందన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 70 శాతం రైతులు వరి పండిస్తే కేంద్రం రా రైస్‌ కొంటామంటుందన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజనవేన సదయ్య, సర్పంచ్‌లు మేకల లావణ్య జనార్దన్‌ రెడ్డి, మిట్టపల్లి కొమురయ్య, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవెందర్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:09 AM