Share News

శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:46 PM

నేరాల దర్యాప్తును శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో కాళేశ్వరం జోన్‌ స్థాయి పోలీస్‌ డ్యూటీమీట్‌ను ఆయన ప్రారంభించారు.

శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయాలి

కోల్‌సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): నేరాల దర్యాప్తును శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో కాళేశ్వరం జోన్‌ స్థాయి పోలీస్‌ డ్యూటీమీట్‌ను ఆయన ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ డ్యూటీ మీట్‌ అవార్డులు, రివార్డులు అందుకోవ డానికి కాదని, పోలీస్‌ సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరు గుపర్చుకోవడానికి, రోజువారి విధుల్లో స్వీయ సమీక్ష చేసుకునేం దుకు ఉత్తమమైన వేదిక అన్నారు. పోటీల్లో గెలుపు, ఓటముల కంటే అనుభవమే ముఖ్యమని, డ్యూటీ మీట్‌లో నేర్చుకున్న అంశా లను తమ యూనిట్‌లలో అమలు చేస్తే పని తీరు మరింత మెరు గుపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో నేరాల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన మెళకువలను నేర్చుకునే అవకాశం లభి స్తుందన్నారు. దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలు, సంక్లిష్ట మైన కేసుల పరిష్కారంలో ఆలోచనలు, అనుభవాలు దోహదపడు తాయన్నారు. ప్రతిభ కనబరిచిన అధికారులు రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గొంటారని చెప్పారు. డ్యూటీమీట్‌లో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు, సైంటిఫిక్‌ ఎయిడ్స్‌టు ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో ఫొరెనిక్స్‌ సైన్స్‌, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌, క్రిమినల్‌ లా, రాత పరీక్ష, మెడికల్‌ లీగల్‌, క్రైమ్‌ సీన్‌ ఫొటోగ్రఫీ అంశాలపై రాత నిర్వహిస్తారని, యాంటి సబోటేజ్‌ విభాగంలో వాహనాల, ప్రాంగణాల, గదుల తనిఖీ, వ్యాక్సస్‌ అంశాలపై పోటీ లు నిర్వహిస్తారన్నారు. కంప్యూటర్‌ అవగాహన, ఆఫీస్‌ ఆటోమేషన్‌ ప్రోగ్రాం, డాగ్‌ స్క్వాడ్‌ పోటీల విభాగంలో ట్రాకింగ్‌, పేలుడు పదా ర్థాలు, మాదక ద్రవ్యాల గుర్తింపు అంశాలపై పోటీలు నిర్వహిస్తా రని, దీనికి సిబ్బంది సిద్ధం కావాలన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్‌ అధికారులు, డీసీపీ అడ్మిన్‌ కే శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేందర్‌గౌడ్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఏసీపీలు రవీందర్‌, ప్రవీణ్‌కు మార్‌, ఇన్‌స్పెక్టర్లు గోపి, బాబురావు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అనీల్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ఆర్‌ఐలు దామోదర్‌, శేఖర్‌, పెద్దన్న, మల్లేషం, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:46 PM