బ్రాంచ్ పోస్టాఫీసులో అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:17 AM
మండలంలో బేగంపేట్, సెంటినరీకాలనీ పోస్టాఫీస్ బ్రాంచ్‌ల్లో జరిగిన అక్రమాలపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. బ్రాంచ్ పోస్టాఫీసులలో సుమారు కోటి రూపాయలకు పైగా ఖాతాదారుల నకిలీ పాస్ బుక్కులను జారీ చేసి అవినీతికి పాల్పడిన విషయం విధితమే.
రామగిరి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలో బేగంపేట్, సెంటినరీకాలనీ పోస్టాఫీస్ బ్రాంచ్‌ల్లో జరిగిన అక్రమాలపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. బ్రాంచ్ పోస్టాఫీసులలో సుమారు కోటి రూపాయలకు పైగా ఖాతాదారుల నకిలీ పాస్ బుక్కులను జారీ చేసి అవినీతికి పాల్పడిన విషయం విధితమే. సంవత్సర కాలంగా అనేక విచారణల చేపట్టిన పోస్టల్ అధికారులు మంగళవారం లద్నాపూర్ పోస్టల్ కార్యాలయంలో డిపార్ట్‌మెంట్ స్థాయి విచారణ చేపట్టారు. ఈ విచారణంలో బేగంపేట్ గ్రామానికి చెందిన 26 మంది బాధితులకు సంబంధించిన రూ.36లక్షల పైగా ఉన్నాయి. రోజుకు ఐదుగురు చొప్పున బాధితులను విచారిస్తున్నారు. అందులో తొలి విడత గ్రామానికి చెందిన బాధితులు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు ఏఎస్‌పి గౌతమ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ మోహన్‌లు హాజరయ్యారు. బాధితులు చెల్లించిన నగదు రశీదులు, వారికి సంబంధించిన పాస్‌బుక్కలను పరిశీలించారు. లద్నాపూర్ బీపిఎం వనం రాంచందర్‌రావు, బాధితులు పాల్గొన్నారు.