Share News

ఇంటర్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:54 PM

ఇంటర్‌ పరీక్షలను కట్టుది ట్టంగా నిర్వహించాలని సీఎస్‌ రామకృష్ణారావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయశ్రీహర్ష, అద నపు కలెక్టర్‌ అరుణశ్రీతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలను కట్టుది ట్టంగా నిర్వహించాలని సీఎస్‌ రామకృష్ణారావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయశ్రీహర్ష, అద నపు కలెక్టర్‌ అరుణశ్రీతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతిం చాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్‌ అనుమతి లేదని, సీసీ కెమెరాల సమక్షంలోనే ప్రశ్నపత్రాల కవర్లను ఓపెన్‌ చేయాలన్నారు. పరీక్ష కేంద్రా లకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఆర్టీసీ అధికా రులు సమయానుకూలంగా బస్సులను నడిపించాలని, పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులతోపాటు పారామెడికల్‌ సిబ్బందిని ఏర్పాటు చేయాల న్నారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా సాగేందుకు చర్య లు చేపట్టాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ (5వ పేజీ తరువాయి)

బోర్డు అధికారి కల్పన, జిల్లా విద్యాధికారి శారద, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ పలువురు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కళాశాలలో మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యా ర్థులు మొదటి సంవత్సరం 182 మంది, ద్వితీయ సం వత్సరం 134 మంది పరీక్షలు రాయనున్నారు. విద్యా ర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్‌ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రా లను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వారు సూచించారు. విద్యార్థులు పెన్నులు, పెన్సిళ్లు మాత్రమే తెచ్చుకోవాలని సూచించారు.

కోల్‌సిటీటౌన్‌, (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రామగుండంలో జూనియర్‌ కళాశాల, ఎన్‌టీపీసీలో సచ్‌దేవ జూనియర్‌ కళాశాల, గోదావరిఖని బాలుర కళాశాల, బాలికల జూనియర్‌ కళాశాల, కృష్ణవేణి వికాస్‌ జూనియర్‌ కళా శాల, కాకతీయ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు పరీ క్షలు రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రా లను రామగుండం తహసీల్దార్‌ ఈశ్వర్‌ మంగళవారం సందర్శించారు. శారదానగర్‌లోని బాలికల జూనియర్‌ కళాశాల పరీక్షకేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, 40 నిమి షాల ముందు నుంచే లోనికి అనుమతిస్తామని ఇం టర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి దాసరి కల్పన తెలి పారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు జూనియర్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సూపరింటెండెంట్‌, ప్రిన్సిపాల్‌ అమరేం దర్‌ తెలిపారు. ఓదెల ప్రభుత్వ కళాశాల, మోడల్‌ కళా శాల, కేజీవీబీ హై స్కూల్‌ చెందిన ప్రథమ సంవత్సర విద్యార్థులు 138 మంది, ద్వితీయ సంవత్సరం 139 మం ది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 11:54 PM