పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:13 AM
ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తంగా 10,367 మంది హాజరు కానున్నారని, వీరి కోసం 22 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రతీ ఒక్క విద్యార్థిని పరిశీలించాలని, పరీక్షల కంటే ముందే పూర్తిస్థాయిలో పరీక్షల కేంద్రాలను తనిఖీలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో పార్కింగ్ ఉండకూడదన్నారు. కేంద్రాలకు నిరంతరం విద్యుత్, మెడికల్, తాగునీరు, మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షల సమయానుకూలంగా బస్సులు నడిపించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి సమక్షంలోనే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేయాలని, ఎవరి వద్ద సెల్‌ఫోన్, ఎలక్ర్టానిక్ పరికరాలు ఉం డకుండ చూడాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బం ది అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కల్పన, ఆర్డీఓలు గంగయ్య, సురేష్, ఏసీపీ కృష్ణ, కలెక్టరేట్ పాలనాధికారి ప్రకాష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు.