Share News

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు నాణ్యతతో చేపట్టాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:50 PM

ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డిలు సూచించారు. స్థానిక మార్కెట్‌ను శుక్రవా రం పరిశీలించి అధికారులతో సమీక్షించారు.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు   నాణ్యతతో చేపట్టాలి

మంథని, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డిలు సూచించారు. స్థానిక మార్కెట్‌ను శుక్రవా రం పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం పూర్తయితే ప్రజలకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మార్కెట్‌ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నామన్నారు. మార్కెట్‌లో వ్యాపారులకు, ప్రజలకు ఇబ్బం దులు లేకుండా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కౌన్సిలర్లు ఎల్లంకి వంశీ, పెంటరి రాజు, ఉన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:50 PM