సమాచారాన్ని నెల రోజుల్లో అందించాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:41 PM
ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని, సమాచా రాన్ని 30 రోజుల్లో అందించాలని, ఆలస్యమైతే ఉచి తంగా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన సమా చార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లి, జూన్ 16 (ఆంరఽధజ్యోతి): ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని, సమాచా రాన్ని 30 రోజుల్లో అందించాలని, ఆలస్యమైతే ఉచి తంగా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన సమా చార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమాచార హక్కు చట్టం అవగాహనలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డితో కలిసి అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయ రాదని, అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాల న్నారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొం దించే శక్తివంతమైన సాధనమన్నారు. ప్రతీ పౌరుడికి ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే హక్కును సెక్షన్-3 కల్పిస్తుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు ఆర్టీఐ దర ఖాస్తులపై ఎటువంటి ఫీజు అవసరం లేదని తెలి పారు. సమాచారాన్ని అందించేందుకు అయ్యే ఖర్చు ఎంత అనేది ప్రజా సమాచార అధికారులు ముం దుగానే దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచిం చారు. 30 రోజుల్లో సమాచారం అందకపోతే సమా చార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇవ్వకపోవడం వల్ల దరఖాస్తుదారునికి నష్టం సంభవిస్తే పరిహారం కోరే అవకాశం కూడా చట్టంలో ఉందని వివరించారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో అవసరమైతే మూడో పక్ష సమాచారాన్ని కూడా వెల్లడించవచ్చని తెలిపారు. ప్రతీ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి, మొద టి అప్పీలేట్ అథారిటీ, రెండో అప్పీలేట్ అథారిటీ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఆర్టీఐ చట్టంలోని వివిధ సెక్షన్ల గురించి అధికారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి అధికారి ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను తెలుసు కోవాలని, అందిన ప్రతీ దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, శాఖలకు సంబంధించిన సమాచా రాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సూచించిన మార్గదర్శ కాలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్టీఐ చట్టం అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచిం చారు. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 570 మందికి పైగా ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలేట్ అథారిటీలు పాల్గొన్నారు. అంతకు ముందు సమాచారం హక్కు చట్టం కమిషనర్లు గౌరవ వందనం స్వీకరించారు. అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, కొప్పుల వెంకటరెడ్డి, డీసీపీ రాంరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు గంగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.