Share News

గురుకులాలకు నాసిరకం సరుకులు

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:10 AM

జిల్లాలో గల మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ప్రభుత్వం విద్యా ర్థులకు సరిపడా మెస్‌ చార్జీలను పెంచినప్పటికీ పౌష్టికాహారం లభించడం లేదు. కూరగాయలు, చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు సర ఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత లేని, నాసిరకం సరుకులను సర ఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గురుకులాలకు నాసిరకం సరుకులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో గల మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ప్రభుత్వం విద్యా ర్థులకు సరిపడా మెస్‌ చార్జీలను పెంచినప్పటికీ పౌష్టికాహారం లభించడం లేదు. కూరగాయలు, చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు సర ఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత లేని, నాసిరకం సరుకులను సర ఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్లు గురుకులాలకు సరుకులు తీసుకవచ్చే సమయంలో టెండర్‌లో పేర్కొన్న మేరకు నాణ్యమైన సరుకులను సరఫరా చేస్తున్నారా, లేదా అని గురుకులాల ప్రిన్సి పాళ్లు, ఉపాధ్యాయులు సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

జిల్లాలో 7 మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికిగాను మటన్‌, చికెన్‌, కూరగాయల సరఫరాతోపాటు పారిశుధ్య నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌ టెండర్లను ఆహ్వానించారు. ఆ మేరకు 95 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ నెల 8వ తేదీన టెండర్‌ బాక్సులను తెరవనున్నారు. ఒక ఏడాది పాటు బహిరంగ మార్కెట్‌లో ఆయా కాలాల్లో ఉండే చికెన్‌, మటన్‌, కూరగాయల ధరలను బట్టి సగటు ధరలను నిర్ణయించుకుని కాంట్రాక్టర్లు టెం డర్లు దాఖలు చేస్తారు. కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్ల సమక్షంలో టెండర్‌ బాక్సులను ఓపెన్‌ చేసి ధరలను నిర్ణయించి టెండర్లు ఖరారు చేస్తారు. తక్కువ ధర కోట్‌ చేసిన కాంట్రాక్టర్ల వైపు అధికారులు మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు తమ కుటుంబానికి చెందిన వారితోనే టెండర్లు వేయిస్తున్నారు. తక్కువ ధర, మధ్య రకం ధర కోట్‌ చేసిన వారి టెండర్‌ దక్కిన వెంటనే వాళ్లు తప్పుకుంటున్నారు. విధి లేక అధిక ధరలు కోట్‌ చేసిన వారికే టెండర్లు కట్టబెడుతున్నారు. అయినా సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులను సరఫరా చేయడం లేదని విద్యార్థుల తల్లితండ్రులు చెబుతున్నారు.

ఫ నాణ్యత లేని చికెన్‌ సరఫరా..

గురుకుల పాఠశాలల్లో ప్రతీ ఆదివారం విద్యార్థులకు చికెన్‌, నెలలో మూడు బుధవారాల్లో మటన్‌తో భోజనం పెడతారు. చికెన్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు. లెగ్‌ పీస్‌లు, బాడీ పీసులు పక్కన బెట్టి, మెడ భాగం, పక్క బొక్కలను గురుకు లాలకు సరఫరా చేస్తున్నారు. అవి బరువు రావడానికి మూడు, నాలుగు గంటల పాటు నీళ్లలో పెడతారు. ఆ నీళ్లను పైపైనే వంచి తూకం వేసి సరఫరా చేస్తున్నారు. గురుకులాల్లో పెట్టే చికెన్‌ భోజనం తినలేక పోతున్నామని తల్లితండ్రులతో విద్యార్థులు వాపోతున్నారు. చికెన్‌లో నాణ్యత లేదని కొందరు ప్రిన్సిపాళ్లు, ఉపాఽధ్యాయులు చెబుతున్నా కూడా కాంట్రాక్టర్లలో మార్పు రావడం లేదని తెలుస్తున్నది. చికెన్‌ తీసుకవచ్చిన రోజు దానిని తిప్పి పంపిస్తే ఆ రోజు విద్యార్థులకు చికెన్‌ అందకపోగా, భోజనాలు వండి పెట్టడం కూడా ఇబ్బంది అవుతుందని ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు తిరస్కరించ లేకపోతున్నారు. నాణ్యమైన చికెన్‌ సరఫరా చేయకపోవడమే గాకుండా, తూకంలోనూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రెండు రోజులకోసారి తాజా కూరగాయలను సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు మూడు, నాలుగు రోజులకోసారి తాజాగా లేని కూరగాయలను సరఫరా చేస్తున్నారు. కూరగాయలు తీసుకవచ్చిన తర్వాత కూడా తూకం వేయకుండానే వాళ్లు చెప్పిన లెక్కలే రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన సరుకులను సరఫరా చేయలేక బ్లాక్‌ లిస్టులో పెట్టిన కాంట్రాక్టర్ల ఈఎండీలను జప్తు చేయాల్సి ఉండగా, రాజ కీయ నాయకులు చెప్పడంతో వాటిని తిరిగి వాపస్‌ ఇస్తున్నారని సమాచారం. ఈ విద్యా సంవత్సరం నుంచైనా విద్యార్థులకు నాణ్య మైన పౌష్టికాహారం అందించేందుకు గాను కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరిశీలించి ఫొటోలు తీసి, తూకం వేసి తీసుకునే విధానాన్ని తీసుకవస్తేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది. ఆ దిశగా కలెక్టర్‌ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:10 AM