అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ జీవితబీమా
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:56 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని కల్పిస్తామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. వడుకాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం పథకాన్ని ఆయన ప్రారంఽభిం చారు.
జూలపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని కల్పిస్తామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. వడుకాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం పథకాన్ని ఆయన ప్రారంఽభిం చారు. బీమా పోస్టర్లను ఆవిష్కరించడంతోపాటు గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రభుత్వవిప్ మాట్లా డుతూ సీఎం రేవంత్‌రెడ్డి పేద ప్రజలకు పలు పథకాలను అందిస్తు రాష్ట్రాన్ని అబివృద్ది పథం వైపు నడిపిస్తున్నాడన్నారు. పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలనలో అర్హులైన ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించ లేదన్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నా మని వివరించారు. సర్పంచ్ పుల్లూరి ప్రశాంతి, తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, ఎంపిడిఓ పద్మజ, ఉపసర్పంచ్ మొగురం రాజేశం, విం డోచైర్మెన్ పుల్లూరి వేణుగోపాల్‌రావు, ఏఓ ప్రత్యూష, అంగన్‌వాడి సూప ర్‌వైజర్ లక్ష్మి, నాయకులు జెట్టి సతీష్, కన్నం రాంనారాయణ, వేల్పుల చిన్న లింగయ్య, కిశోర్, మారుపాక కుమార్, సంపత్, పాల్గొన్నారు.