Share News

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:08 AM

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీపీఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పెద్దపల్లి మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీపీఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పెద్దపల్లి మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఎలాంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని చెబుతూనే మరోవైపు వరంగల్లో ఇండ్లులేని పేదల గుడిసెలు వేసుకుంటే కాంగ్రెస్‌ వాటిని తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని జూలై 1న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామని , కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇరాన్‌ అమెరికా యుద్ధాన్ని ఆపలేని అసమర్థత ప్రధాని మోదీ అని, రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొందరు బిజెపి నాయకులు బెంగాల్‌ తరహాలోనే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపడతామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఒక్క ఓటు కూడా పోకుండా ఎస్‌ఐఆర్‌ నిర్వహించాలని అధికారులను సూచిం చారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వంపై మతోన్మా దానికి వ్యతిరేకంగా వామ పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన తెలి పారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మి కుల సమస్యలపై మం డల అధ్యక్షుడు రమేష్‌ వినతి పత్రం అందించగా త్వరలోనే ఈ విషయమై మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి సునీల్‌ సిపిఐ కార్పొరేటర్‌ మార్కాపూర్‌ సూర్య, పెద్దపల్లి మండల పట్టణ కార్యదర్శులు రమేష్‌, నవీన్‌, కల్లేపల్లి రవి, జింక విఠల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు లెనిన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:08 AM