ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:47 PM
అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. మంగళవారం రంగంపల్లిలోని 10, 11 వార్డుల్లో అర్హులైన 36 మంది ఇండ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
పెద్దపల్లి టౌన్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. మంగళవారం రంగంపల్లిలోని 10, 11 వార్డుల్లో అర్హులైన 36 మంది ఇండ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ. అర్హులైనవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అం దుతున్నాయన్నారు. గత పాలకులు పేదలకు డబల్ బెడ్ రూంలు ఇస్తామని హామీలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయకుండా పబ్బం గడి పారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, పెద్దపల్లి పట్టణంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడు తున్నామని, పట్టణం కాంగ్రెస్ హయంలో సుందరంగా మారుతుందని గుర్తు చేశారు. నియోజకవర్గరంలో 1000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిం చాలని ప్రజలను కోరారు. ప్రతీ గల్లీకి తాగునీరు, విద్యుత్తు దీపాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంక టేష్, మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు