Share News

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:13 AM

రామగుండం కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేందుకు వార్డు అధికారులు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ అన్నారు. గురువారం హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజేశ్వర్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు   త్వరగా పూర్తి చేయాలి

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేందుకు వార్డు అధికారులు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ అన్నారు. గురువారం హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజేశ్వర్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలను నిర్వహించేలా లబ్దిదారులను ప్రోత్సహిం చాలన్నారు. లబ్దిదారుల్లో స్వశక్తి మహిళలు ఉంటే మెప్మా ద్వారా రూ.1లక్ష ఆర్థిక సహాయాన్ని అందించాలని, రాబోయే వర్షాకాలంలో ఇంటి నిర్మాణ పనులకు అంతరాయం కలుగనున్న నేపథ్యంలో వేసవిలో ఇందిరమ్మ గృహాలు పూర్తయ్యే విధంగా చూడాలని, ఇందిరమ్మ ఇండ్లు 400చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం ఉం డాలని, తక్కువ స్థలం ఉన్న వారు జీ ప్లస్‌-1లో కింద 200చదరపు అడుగులు, పైన 200చదరపు అడుగులు నిర్మించుకోవచ్చునని, నిబంధనల ప్రకారం సెట్‌ బ్యాక్‌ వదలాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ ఈఈ పీవీ రామన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, సెక్రటరీ మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఓ ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:13 AM