Share News

భారతీయ విలువలను ముందుకు తీసుకెళ్లాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:19 PM

సమా జంలో ప్రతీ ఒక్కరు భారతీయ విలువలను ముందుకు తీసుకెళ్లాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రామ వికాస్‌ ప్రముఖ్‌ జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం లక్ష్మినరసింహ గార్డెన్స్‌లో ఎన్టీపీసీ పట్టణ విరాట్‌ హిందూ సమ్మేళనం అధ్యక్షుడు వొల్లాల సురేష్‌, కార్యదర్శి నల్లి నరేష్‌ ఆధ్వ ర్యంలో జరిగిన సమ్మేళనంలో డాక్టర్‌ ఇందిరా, ఇస్కాన్‌ ప్రచాకులు హృషికేష్‌ దాస్‌ ప్రభుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ మహ రాజ్‌ను పూజించారు.

భారతీయ విలువలను ముందుకు తీసుకెళ్లాలి

జ్యోతినగర్‌, ఏప్రిల్‌25(ఆంధ్రజ్యోతి): సమా జంలో ప్రతీ ఒక్కరు భారతీయ విలువలను ముందుకు తీసుకెళ్లాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రామ వికాస్‌ ప్రముఖ్‌ జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం లక్ష్మినరసింహ గార్డెన్స్‌లో ఎన్టీపీసీ పట్టణ విరాట్‌ హిందూ సమ్మేళనం అధ్యక్షుడు వొల్లాల సురేష్‌, కార్యదర్శి నల్లి నరేష్‌ ఆధ్వ ర్యంలో జరిగిన సమ్మేళనంలో డాక్టర్‌ ఇందిరా, ఇస్కాన్‌ ప్రచాకులు హృషికేష్‌ దాస్‌ ప్రభుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ మహ రాజ్‌ను పూజించారు. ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణలో యువత పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. దేశ సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక సందేశాలు, జాతీయ చైతన్యాన్ని పెంపొందించే ప్రసం గాలతో సభ ఆకట్టుకుంది. భజనలు, నృత్య ప్రదర్శనలు, వేదపఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా నిర్వాహకులు మాట్లాడు తూ ఇలాంటి సమ్మేళనాలు హిందూ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషి స్తాయన్నారు. భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఎస్‌ఆర్‌ ఎం అధినేత మాచిడి మహేందర్‌ గౌడ్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:19 PM