డిసెంబరు 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:38 PM
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్ల సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధమవుతున్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
సుల్తానాబాద్, నవంబరు10(ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్ల సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధమవుతున్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని సమ్మె నోటీసు అందజేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని, సమ్మె కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతి ఆశా వర్కర్‌కు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, అంత్యక్రియల ఖర్చుల కింద రూ. 50 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఆశా వర్కర్ల వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ఆశా వర్కర్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జ్యోతి, ఏ.స్వరూప టీ.శారద, ఎం.పద్మ, మణీంద్ర, సరిత, కళావతి, రేణుక, సరోజన, స్వప్న, ప్రేమలత పాల్గొన్నారు.