Share News

పంచాయతీలో సరిగా లేని రికార్డులు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:07 AM

పంచాయతీ లెక్కలు అడిగితే రికార్డులు రాస్తారా అంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మారం కొమురయ్య ఆక్షేపించారు. ధూళికట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో పలువురు వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంచాయతీలో సరిగా లేని రికార్డులు

ఎలిగేడు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ లెక్కలు అడిగితే రికార్డులు రాస్తారా అంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మారం కొమురయ్య ఆక్షేపించారు. ధూళికట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో పలువురు వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీలో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరం రికార్డులు సరిగా లేకపోవడంతోపాటు పంచాయతీ సాధారణ నిధులు ఎస్‌ఎఫ్‌సీ, వసూలు చేసిన ఇంటి పన్నులు, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రికార్డుల్లో జమ కాలేదన్నారు. లెక్కలు చూపాలని అడిగి రెండు నెలలు కావస్తున్నా అప్పగించ లేదన్నారు. ఈ విషయమై నూతన పాలక వర్గం ఈ నెల 17న కలెక్టర్‌ కోయశ్రీహర్షకు ఫిర్యాదు చేశామని సర్పంచ్‌ తెలిపారు. దీంతో స్పెషల్‌ ఆఫీసర్‌, ఎంపీవో కిరణ్‌తో పాటు కార్యదర్శి సురేష్‌లు శని, ఆదివా రాలు పాలకవర్గం అనుమతి లేకుండా రికార్డుల్లో మార్పులు చేశారని పేర్కొ న్నారు. రెండు నెలలుగా రికార్డులు అడు గుతున్నా ఎంపీవో ఒత్తిడితో కార్యదర్శి రికార్డులు ఇవ్వడం లేదని, దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. సెలవురోజు ఎలా రికార్డులను సరిచేస్తారని ఆయన ప్రశ్నిం చారు. ఈ విషయమై అడుగగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రికార్డులను తనిఖీ చేశామని సమాధానం చెప్పడం సరికా దన్నారు. దీనికి మండల పంచాయతీ అధికారి బాధ్యత వహించాలన్నారు. ఉన్న తాధికారులు స్పందించకుంటే గ్రామపం చాయతీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. వార్డుసభ్యులు బత్తిని శ్రీనివాస్‌, ఇరుగురాల రవి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:07 AM