Share News

కాలువలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలి

ABN , Publish Date - May 14 , 2026 | 12:09 AM

రామగుండం కార్పొ రేషన్‌ పరిధిలో కాల్వలపై నిర్మించిన అక్రమ నిర్మాణా లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. వార్దు సందర్శనలో భాగంగా బుధవారం మేయర్‌ మహంకాళి స్వామితో కలసి అశోక్‌నగర్‌, లక్ష్మీనగర్‌ ప్రాంతాలలో పర్యటించారు.

కాలువలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలి

కోల్‌సిటీ, మే 13(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొ రేషన్‌ పరిధిలో కాల్వలపై నిర్మించిన అక్రమ నిర్మాణా లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. వార్దు సందర్శనలో భాగంగా బుధవారం మేయర్‌ మహంకాళి స్వామితో కలసి అశోక్‌నగర్‌, లక్ష్మీనగర్‌ ప్రాంతాలలో పర్యటించారు. కాల్వలపై అక్రమ నిర్మాణాల కారణంగా నీళ్ళు ఇళ్ళలోకి రావడం, నీరు నిలిచి దుర్గం ధం వ్యాపిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కాల్వలపై ఆక్రమణతో అత్యవసర పరిస్థి తుల్లో అంబులెన్స్‌, ఫైరింజన్‌ రావడానికి ఇబ్బంది ఉంటుందని సూచించారు. ఖాళీ స్థలంలో చెత్తవేయవద్దని, బహిరంగ ప్రదే శాల్లో చెత్తవేసే జరిమానాలు వేయాలని అధికారులకు సూచించారు. పదేళ్ళుగా పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నా మన్నారు. లక్ష్మీనగర్‌ రోడ్లను విశాలంగా తీర్చిదిద్దే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదని, త్వరలో గణేష్‌నగర్‌ వైపు రోడ్డు నిర్మాణం ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్‌ ఆకారపు రేఖ, ఎస్‌ఈ గురువీర, నవీన్‌, ఆఫ్తాబ్‌, శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

మహిళా అభ్యున్నతి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యన్నతికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్ర మాన్ని ఇందిరానగర్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను మహాలక్ష్మిగా గౌర విస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రతి మహిళ స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని ఎటువంటి పూచీకత్తు లేకుండా సబ్సిడీ రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. సోలార్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంక్‌ వంటి యూనిట్లను స్థాపించడానికి సహ కారం అందించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తు న్నట్టు తెలిపారు. మేయర్‌ మహంకాళిస్వామి మాట్లాడు తూ నాణ్యమైన మన్నికైన చీరలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులతో పాటు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:09 AM