Share News

అక్రమంగా మొరం తరలింపు

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:36 PM

నర్సాపూర్‌లోని గాండ్లోని కుం ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఇటీవల ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తూ కుంటలో పుడికతీత పనులు చేపట్టారు. నల్ల మట్టి తొలగిపో వడంతో మొరం బయటపడింది. దీనిపై మట్టి మాఫియా కన్నుపడింది.

అక్రమంగా మొరం తరలింపు

ఎలిగేడు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటల నుంచి అక్రమంగా మట్టిని తవ్వుతూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అధికా రులు పట్టించుకోకపోవడంతో అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వు లు...ఆరు కాయలు అన్న చందంగా ఉంది. నర్సాపూర్‌లోని గాండ్లోని కుం ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఇటీవల ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తూ కుంటలో పుడికతీత పనులు చేపట్టారు. నల్ల మట్టి తొలగిపో వడంతో మొరం బయటపడింది. దీనిపై మట్టి మాఫియా కన్నుపడింది. కొందరు ముఠాగా ఏర్పడి అక్రమంగా మొరంను సుల్తానాబాద్‌ మండలం శాస్ర్తీనగర్‌, నారాయణపల్లి తదితర గ్రామాలకు తరలిస్తున్నారు. కొన్నిరో జుల నుంచి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి వేళల్లో ఎక్స్‌కావేటర్‌ సహాయంతో మొరం తవ్వి ట్రాక్టర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సుమారు 15కుపైగా ట్రాక్టర్ల ద్వారా మొరం తరలింపు కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని నిలిపివేశారు. అనుమతులు లేకుండా కుంటలోని మట్టిని తవ్వడం నేరమని, ఇలాంటి చర్యలు కొన సాగితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో జరుగు తున్న అక్రమ మట్టి తరలింపుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:36 PM