Share News

సింగరేణిపై ప్రేమ ఉంటే బొగ్గు బ్లాక్‌లను ఇప్పించండి

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:47 PM

సింగరేణిపై ఉంటే వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు.

సింగరేణిపై ప్రేమ ఉంటే బొగ్గు బ్లాక్‌లను ఇప్పించండి

గోదావరిఖని, జూలై 7(ఆంధ్రజ్యోతి): సింగరేణిపై ఉంటే వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపో యిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కను కాపాడడానికేనని ఆయన ఆరోపించారు. సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణంపైన, డీజిల్‌, పేలుడు పదార్థాల కొనుగోలు, ఓవర్‌ బర్దన్‌ తొలగింపు టెండర్లలో అవినీతి, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటులో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బొగ్గు నిల్వలపైన సింగరేణి యాజమాన్యం విజిలెన్స్‌ విచారణ జరపాలని పేర్కొన డం విడ్డూరంగా ఉందన్నారు. గోలేటి, మాదారం, కేకే ఓసీ మందమర్రి, జేకే-5 విస్తరణ ఇల్లందు, మణుగూరు ఓపెన్‌ కాస్ట్‌ గనుల అనుమతులను ఇప్పించి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి రావలసిన 58 వేలకోట్ల రూపాయల బకాయిలను తక్షణమే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ నిబంధన వలన సంస్థకు జరుగుతున్న నష్టంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జాహిద్‌ పాషా, నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఐ సత్యం, ఏ గోపి, అక్తార్‌ పాషా, రోడ్డ సంపత్‌, పులిపాక శంకర్‌, వీ గౌడ్‌, రాజ్‌ కుమార్‌ చారి, పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:47 PM