నాలాలను కబ్జా చేస్తే కూల్చివేస్తాం
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:40 PM
నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మా ణాలు చేస్తే కూల్చివేస్తామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. శుక్రవారం 35వ డివిజన్‌లో వార్డు బాటలో పాల్గొన్నారు. అక్రమంగా ప్రధా న కాలువ పక్కన నిర్మించిన కట్టడాలను సిబ్బంది తొలగించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో నాలాల పూడికతీత నిరంతరం కొనసాగుతుందని, బఫర్ జోన్‌ను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేతలు తప్పవన్నారు.
కోల్‌సిటీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మా ణాలు చేస్తే కూల్చివేస్తామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. శుక్రవారం 35వ డివిజన్‌లో వార్డు బాటలో పాల్గొన్నారు. అక్రమంగా ప్రధా న కాలువ పక్కన నిర్మించిన కట్టడాలను సిబ్బంది తొలగించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో నాలాల పూడికతీత నిరంతరం కొనసాగుతుందని, బఫర్ జోన్‌ను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేతలు తప్పవన్నారు. బఫర్ జోన్‌లో శానిటేషన్ ట్రాక్టర్ వెళ్లడానికి వీలుగా సీసీ రోడ్డును నిర్మిస్తామని, ప్రస్తుతం నగర పాలక సంస్థపై ఆర్థిక భారం పడకుండా మున్సిపల్ సిబ్బందిపై పనులు చేయిస్తున్నామన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని కోరారు. ఐబీ కాలనీలో పేరుకుపోయిన చెత్తను నీటి సరఫరా కోసం తవ్విన గుంతలతో ప్రమాదాలు జరుగకుండా మూసివేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ గడ్డం రమాదేవి శ్రీనివాస్, కంక ణాల మౌనిక రాజు, వడ్లూరి రవి, దాసరి సాంబమూర్తి, దూళికట్ట సతీష్; నాయకులు పీచర శ్రీనివాస్, వేగోళపు శ్రీనివాస్, డీఈ షాబాజ్, ఏఈ మీర్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు.