రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు
ABN , Publish Date - May 11 , 2026 | 11:59 PM
రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. సోమవా రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సబ్ డివిజన్ రౌడీషీ టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
కోల్‌సిటీ, మే 11(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. సోమవా రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సబ్ డివిజన్ రౌడీషీ టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో రౌడీషీటర్లలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రౌడీషీటర్ల నేరచరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంద న్నారు. సిమ్స్ మెడికల్ కళాశాల సైక్రియాస్ట్ రవి వర్మతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ మద్యానికి బానిస కావడం వల్ల తమపై తాము నియంత్రణ కోల్పోయి వివాదాలకు వెళతారని, కోపం తో గొడవలు పడతారన్నారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెంచుకోవాలన్నారు. ఎవరికి ఏ రక మైన మానసిక ఇబ్బంది కలిగినా నేరుగా సంప్రదిం చవచ్చునని, అన్నీంటికి పరిష్కారం లభిస్తుందన్నారు. గంజాయికి అలవాటు పడిన వారిని దూరంగా ఉం చేందుకు అవసరమైతే డీఅడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించే చర్యలు చేపడుతామన్నారు. రౌడీషీట ర్లకు నర్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. మత్తు పదా ర్థాలు వినియోగించినట్టు తేలితే మొదట కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చ రించారు. వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి, ఇన్ స్పెక్టర్ అఫ్జలుద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, టుటౌన్ సీఐ ప్రసాద్ రావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐలు మనోహర్, రమేష్ పాల్గొన్నారు.