విద్యుత్, నీళ్లు ఇవ్వకుంటే సబ్‌స్టేషన్లు ముట్టడిస్తాం
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:50 PM
రైతు లకు సాగునీరు, సరిపడ కరెంట్ సరఫరా చేయాలని, పంటలను కాపాడాలని శుక్రవారం పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణు లతో కలిసి పుట్ట మధు ధర్నా, రాస్తారోకో చేశారు.
మంథని, ఆక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతు లకు సాగునీరు, సరిపడ కరెంట్ సరఫరా చేయాలని, పంటలను కాపాడాలని శుక్రవారం పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణు లతో కలిసి పుట్ట మధు ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు ఎండిపోయే పరిస్థితి చూసైనా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వ్యవసాయానికి సరపడా కరెంటు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ సాగు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదురుతున్న ఎండలు, విద్యుత్ కొరతలతో మంథని ప్రాంతంలో పం టలు ఎండిపోతున్నాయని, రైతుల కష్టాలు తీర్చకపోతే సబ్‌స్టేషన్‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజల పక్షనా పోరాటం చేస్తే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇచ్చి న హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిందని, కరెంటుకు డిమాండ్ ఉంటుందని తెలిసినా పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్త నుంచి రాహుల్ గాంధీ వర కు దోపిడీ మీద ఉన్న ద్యాస ప్రజల మీద లేద న్నారు. పోలీసులు జ్యోకం చేసుకొని ఆందోళన విరమింపజేశారు. రైతులు పాల్గొన్నారు.