నియోజకవర్గాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - May 12 , 2026 | 11:57 PM
పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సబ్బితంలో రూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి పనులకు, గౌరెడ్డిపేటలో రూ. 43లక్షలతో ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యేచింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.
పెద్దపల్లి రూరల్, మే 12 (ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సబ్బితంలో రూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి పనులకు, గౌరెడ్డిపేటలో రూ. 43లక్షలతో ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యేచింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. మాట్లాడుతూ పెద్దపల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్బితం జలపాతం సందర్శకులను ఆకర్షిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లతో జలపాతం అభివృద్ధి చేస్తోందన్నారు. గౌరెడ్డిపేటలో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా ప్లాస్టిక్ రా మెటీరియల్ తయారీ అవుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ చేసి ముడి సరుకులు తయారు చేసి టెల్స్, దారం వాటికి ఉపయోగిస్తారని తెలిపారు. ఈ యూనిట్ మహిళా సంఘాల సభ్యుల ఆద్వర్యంలో పని చేస్తుందని, దీనికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, పర్యాటక అధికారులు, సర్పంచులు, కొమ్ము సుజాత, నూనె సరోజన, మునిసిపల్ చెర్మన్ నూగిల్ల మల్లయ్య, మార్కెట్ చెర్మన్ కూర మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.