Share News

పోలీసుల తొందరపాటు చర్యలపై ఫిర్యాదు చేస్తా

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:26 PM

మండలం లోని నిట్టూరులో బుధవారం రాత్రి బీఆర్‌ఎస్‌ నాయ కులు, ప్రజలపై రూరల్‌ పోలీసులు జరిపిన లాఠీఛార్జీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో బాధితులను పరామర్శించారు.

పోలీసుల తొందరపాటు చర్యలపై ఫిర్యాదు చేస్తా

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 4 (ఆఽంఽధ్రజ్యోతి): మండలం లోని నిట్టూరులో బుధవారం రాత్రి బీఆర్‌ఎస్‌ నాయ కులు, ప్రజలపై రూరల్‌ పోలీసులు జరిపిన లాఠీఛార్జీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో బాధితులను పరామర్శించారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం, పోలీసుల అత్యుత్సాహం వల్ల సామాన్య ప్రజలు బాధి తులుగా మారడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లు వేగంతో వెళ్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నా అధికా రులు పట్టించుకోలేదన్నారు. బుఽధవారం రాత్రి లారీ అతి వేగంగా వచ్చి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో విరిగిపో యిందన్నారు. సర్పంచ్‌ భర్త ఆకుల శ్రీనివాస్‌ వెంటనే స్పందించి లారీని ఆపి, డ్రైవర్‌ను తీసుకువచ్చారని తెలిపారు. లారీల అతివేగంపై ఆగ్రహంతో ఉన్న యువకులు మూడు లారీల అద్దాలు పగలగొట్టారని, ఆ సమయంలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అక్కడికి వచ్చిన పెద్దపల్లి రూరల్‌ ఎస్‌ఐ మల్లేశం, సీఐ ప్రవీణ్‌లు ఎలాంటి విచారణ జరపకుండా ప్రజలను దూషిస్తూ లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తుల ఒంటిపై వాతలు రావడం వారి అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. లారీల వేగాన్ని నియంత్రించాలని కోరారు. ఉప్పు రాజ్‌ కుమార్‌, సలేంద్ర రాములు, మాదారపు వేణు గోపాల్‌ రావు, సంపత్‌ రావు, హరీష్‌, పెంచాల శ్రీధర్‌, నాంసాని సరేష్‌ బాబు,సిరవేని లవన్‌ కుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 11:26 PM