Share News

పాండవుల గుట్టను తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:47 PM

మండల కేం ద్రంలోని పాండవుల గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లు తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పాండవుల గుట్టపై జగత్‌ మహామునేశ్వర స్వామి ఆల యంలో వేద పాఠశాల 25 ఏళ్లుగా నడుస్తున్న సందర్భంగా మూడు రోజులుగా శత రుద్ర హోమాలు జరిపించారు.

పాండవుల గుట్టను తీర్చిదిద్దుతా

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలోని పాండవుల గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లు తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పాండవుల గుట్టపై జగత్‌ మహామునేశ్వర స్వామి ఆల యంలో వేద పాఠశాల 25 ఏళ్లుగా నడుస్తున్న సందర్భంగా మూడు రోజులుగా శత రుద్ర హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే పాల్గొనగా పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేయగా, జగత్‌ మహామునేశ్వర స్వామి పీఠాధిపతి బసవ త్తుల రాజమౌళి ఆచార్యులు ఎమ్మెల్యేను సన్మానించి జ్ఞాపి కను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పాండ వుల గుట్టను ఎవరు పట్టించుకోలేదని, బసవత్తుల రాజ మౌళి గుట్టపై ఆలయం నిర్మించి వేద పాఠశాల నెలకొల్పి ఎందరికో వేదాలు నేర్పి జ్ఞానం పంచారని కొనియాడారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికంగా వేద పట్టణాలతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో వేద పాఠశాల ఉండటం మన నియోజకవర్గానికి ఎంతో గర్వకారణమ న్నారు. ఈ గుట్ట ప్రాంతాన్ని మరింత అబివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు తిప్పర్తి సత్యచార్యులు, మొల కల గోవర్దనశాస్ర్తి ఆధ్వర్యంలో హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Updated Date - Mar 15 , 2026 | 11:47 PM