Share News

పంట మార్పిడితో అధిక దిగుబడులు

ABN , Publish Date - May 05 , 2026 | 11:51 PM

రైతులు తమకు లాభసాటిగా ఉండే పంటలను సాగు చేయాలని మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు అన్నారు. సుద్దాల రైతువేదిక వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

పంట మార్పిడితో అధిక దిగుబడులు

సుల్తానాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతులు తమకు లాభసాటిగా ఉండే పంటలను సాగు చేయాలని మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు అన్నారు. సుద్దాల రైతువేదిక వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ వెంకన్న భూసార పరిరక్షణ గురించి వివరిస్తూ వివిధ పంటలలో సిఫారసు చేసిన ఎరువుల గురించి అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి పైడితల్లి మాట్లాడు తు భూసార పరిరక్షణ అందరి బాధ్యత అంటూ రైతులందరిచే భూసార పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్‌ ఒజ్జ సంపత్‌, ఉద్యానవన శాఖ అధికారి శ్రీదర్‌, ఏఈఓ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి) : రైతులు అధిక యూరియా వాడకం వల్ల నష్టాలు జరుగుతున్నాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ తక్కువ యూరియా వినియోగంతో సాగు ఖర్చులు తగ్గించుకోవడం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చాన్నారు. శాస్త్రవేత్తలు డా.అరుణ్‌కుమార్‌, డా. రాకేష్‌, డా.రవళి, వ్యవసాయ విస్తరణ అధికారి పూర్ణచందర్‌ పాల్గొన్నారు.

మంథనిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): కన్నాల గ్రామపంచాయతీ కార్యాలయం లో ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వావిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఏవో నవ్య, సర్పంచ్‌ గుడిసె గట్టయ్య, ఏఈవో స్రవంతిలు పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి) : రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ సాగు విధానాన్ని పాటించాలని ప్రొఫెసర్‌ తిరుపతి అన్నారు. కొలనూర్‌ రైతు వేదికలో అవగాహన సదస్సును నిర్వహించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తిరుపతి, డా.రాణి మాట్లాడుతూ సేంద్రియ సాగుతో భూములు సారవంతమై దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుం దని తెలిపారు. సర్పంచ్‌ కనుకయ్య, ఏఓ భాస్కర్‌, విస్తరణ అధికారులు రాకేష్‌,అజయ్‌ ఆయిల్‌ పామ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌,పంచాయతీ కార్యదర్శులు,ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

మంథనిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): పుట్టపాక గ్రామ పంచాయతి ఆవర ణలో రైతులకు వివిధ రకాల పంటల సాగుపై అవగాహన పమావేశం నిర్వహించారు. మంథని, ముత్తారం, రామగిరి మండలంలోని రైతులు పాల్గొన్నారు. వారికి కూరగాయలు, ఆయిల్‌ పామ్‌ సాగు, ఇతర ఉద్యాన పంటల సాగు విధానాలు, బిందు సేద్యం పై వివరించారు. పంట మార్పిడి, ఎరువుల వినియోగం అవగాహన కల్పించారు. అధికారులు రాజశేఖరు, నవ్య, సరేష్‌, మధుకర్‌, ప్రత్యుష, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, సర్పంచ్‌ రాజబాబు, రైతులు పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌, (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే రైతులను రాజుగా మార్చుతుందని మార్కె ట్‌ చైర్మన్‌ వైనాల రాజు, మం డల వ్యవ సాయ అధికారి గిరి రామకృష్ణ అన్నారు. నాగారం, లింగాల రైతువేదికలో అవ గాహన సదస్సు నిర్వహించారు. ప్రతీ రైతు పొలాల్లో ఆయిల్‌ పామ్‌ చెట్లను నాటాలని, ప్రభు త్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. రైతులకు ఆసక్తి ఉంటే ఫీల్డ్‌ ఆఫీసర్‌ రాకేష్‌ను సంప్రదించా లన్నారు. నాగారం సర్పంచ్‌ పొనుగంటి కుమార్‌, ఏడీఏ టెక్నికల్‌ కాంతారావు, ఎన్‌పీడీసీఎల్‌ ఏఈ అశోక్‌, కేవీకే రామగిరి శాస్త్రవేత్త వినోద్‌ కుమార్‌, పేరపల్లి సర్పంచ్‌ బొంగోని సదయ్య, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ రవి, ఏఎంసీ కార్యదర్శి ఈర్ల సురేందర్‌, ఉపసర్పంచ్‌ ఉడ్నాల శ్రీనివాస్‌, విస్తరణ అధికారి శ్వేత పాల్గొన్నారు.

అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): రైతులు పంటమార్పిడి చేపడితే అధిక దిగు బడులు సాధించే అవకాశం ఉందని ఉద్యానవన, వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని రైతులకు సోమనపల్లి రైతువేదికలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ సాగు, అంతర్‌పంటలు, నేల పరీక్షలు, రసాయన ఎరువుల వాడకంపై వివరించారు. కేవీకే శాస్త్రవేత్త నవ్య, వ్యవసాయ అధికారి సతీష్‌, ఉద్యా నవన విస్తరణఅధికారి రాము, ఏఈఓ రమేష్‌, తిరుమల ఫీల్డ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ కుమార్‌, కంపెనీ ప్రతినిధి కార్తీక్‌ కుమార్‌, భవిష్య డ్రిప్‌ కంపెనీ ప్రతినిధి రాజ్‌ కుమార్‌, సోమనపల్లి సర్పంచ్‌ బాపు, పొట్యాల సర్పంచ్‌ లోకేష్‌ రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 11:51 PM