పంట మార్పిడితో అధిక లాభాలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:29 PM
ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దబొంకూర్‌లో రాజేశం అనే రైతు అయిల్‌పామ్ సాగు చేయగా క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దబొంకూర్‌లో రాజేశం అనే రైతు అయిల్‌పామ్ సాగు చేయగా క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్ రైతును సాగు పద్ధతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయిల్‌పామ్‌తోపాటు అంతర పంటగా తక్కువ వ్యయంతో వెదురు బొంగులను ఉపయోగించి బీరకాయ, కాకరకాయ, సోరకాయ వంటి కూరగాయలు సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతుండటంతో రైతును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వరి సాగు చేయకుండా కూరగాయలు, ఆయి ల్‌పామ్‌తో పాటు పంట మార్పిడి చేసుకొని అధిక ఆదాయం పొం దాలని రైతులకు సూచించారు. పంటల నిర్వహణ, ఎరువుల విని యోగం, నీటి యజమాన్యం, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సాంకేతిక ఉద్యానవన శాఖ అధికారి సుంకం మహేష్, ఉద్యానవన విస్తరణ అధికారి బొడుకల రాము, రైతులు పాల్గొన్నారు.