Share News

భానుడి భగభగ...

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:44 PM

రోజు రోజుకు భానుడి ప్రతాపం పెరిగిపోతున్నది. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. శుక్రవారం గరిష్ట 39.2 డిగ్రీలు, కనిష్ట 23.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉదయం 7గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

భానుడి భగభగ...

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకు భానుడి ప్రతాపం పెరిగిపోతున్నది. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. శుక్రవారం గరిష్ట 39.2 డిగ్రీలు, కనిష్ట 23.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉదయం 7గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు రామగుండం పారిశ్రామిక ప్రాం తంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, శివాజీనగర్‌ ఏరియాల్లో నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాలు జనం లేక వెలవెలబోతున్నాయి. 11గంటల నుంచే భానుడు భగభగమంటుండగా జనం ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. చాలా మంది గొడగులు, జేబురుమాల్లు, టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. గురువారం గరిష్ట 38.7, కనిష్ట 24.0, బుధవారం 38.2, 21.5, మంగళవారం 38.0, 24.5, సోమవారం 38.0, 24.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు..

పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతర్గాం మండలం ఆకెనపల్లి, పెద్దపల్లి మండలం పాల్తెం, భోజన్నపేటలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమదయ్యాయి. రామగుండం, ముత్తారం మండలంలో 41.3, మంథని, పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్ళపెల్లిలో 41.2, ఎలిగేడు, రామగుండం మండలం ముత్యాలపల్లి, రామగిరి మండలం కల్వచర్లలో 41.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లి 40.9, కమాన్‌పూర్‌ 40.7, సుల్తానాబాద్‌ మండలం కనుకుల 40.6, మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ 40.3, కాల్వశ్రీరాంపూర్‌, ధర్మారంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 10 , 2026 | 11:44 PM