విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:03 AM
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రభుత్వ దవాఖానాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలో అంగన్‌వాడి భవనంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ధర్మారం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రభుత్వ దవాఖానాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలో అంగన్‌వాడి భవనంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంగళవారం ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం సామాన్యులకు అందేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. మేడారంలో 30 పడకల ఆసుపత్రితోపాటు ప్రాఽథమిక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రైవేటు దవాఖానాలకు వెల్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. మండలంలో 18106 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. జక్కనపల్లి నుండి ఎర్రగుంటపల్లి వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి నిధులు కేటాయించామని, త్వరలోనే టెండర్ల పక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఎర్రగుంటపల్లిలో 5 ఎకరాల్లో ఏటీసీ ఏర్పాటు చేస్తున్నామని, యువతకు స్కిల్స్ డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా పీహెచ్‌సీలో ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. డీఎస్‌ఓ శ్రీనాథ్, ఆర్డీఓ గంగయ్య, తహాశీల్దార్ దొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీడీఓ సుమలత, డిప్యూటీ తహశీల్దార్ ఉదయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.