Share News

విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:02 AM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

పెద్దపల్లి రూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. హన్మంతుని పేట, మారేడుగొండ, మూలసాల, గుర్రంపల్లి గ్రామాల్లో డీఎంఎఫ్‌టి నిధులు రూ.1.18 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతు, టాయిలెట్స్‌, కిచెన్‌ షెడ్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం రూ.5.70 కోట్ల నిధులు స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పదో తరగతి ఫలితాల్లో గత సంవత్సరం రాష్ట్రంలోనే జిల్లా అగ్రభాగాన నిలవడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో విద్యాభోదన అందించాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని, స్వంత ప్రయివేట్‌ విద్యాసంస్థల అభివృద్ధిని పెంచుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. హన్మంతునిపేట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200లకు చేరిందన్నారు. రానున్న రోజుల్లో పాఠశాలల్లో టీచర్లు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కోరారు. సర్పంచులు మ్యాడగోని శ్రీనివాస్‌ గౌడ్‌, గుర్రం దేవేంద్ర నాగరాజు, సంపత్‌, కనపర్తి సంపత్‌ రావు, జూపాక శ్వేతవెంకటేష్‌, నాయకులు సుధాకర్‌ రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి, మందల సత్యనారాయణ రెడ్డి, సంతోష్‌, ఆడెపు వెంకటేశం, తిరుపతిరావు, ప్రదీప్‌, ముత్యాల నరేష్‌, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:02 AM