Share News

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక ఆదాయం

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:22 AM

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు అధిక ఆదా యాన్ని పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శ్యాం ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక ఆదాయం

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు అధిక ఆదా యాన్ని పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శ్యాం ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. తోటల నిర్వహణ, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం అంశాలపై రైతులతో మాట్లాడి సాంకేతిక సూచనలు అం దించారు. ఆయిల్‌పామ్‌ తోటల్లో సరైన యాజ మాన్య పద్ధతులు పాటించడం ద్వారా మెరు గైన దిగుబడులు, అధిక ఆదాయం పొంద వచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ రైతులకు పలు సబ్సిడీలు ప్రోత్సహి స్తోందన్నారు. రైతులకు అవసరమైన మార్గద ర్శకాలను ఉద్యానవన శాఖ అధికారులు నిరం తరం అందిస్తూ, ఆయిల్‌పామ్‌ సాగులో రైతు లకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. విస్తరణ అధికారి రాము, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:22 AM