Share News

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:11 AM

ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఆ తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం బహిర్గతమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషన్‌ నివేదిక సహజ న్యాయసూత్రాలు, ప్రాథమిక హక్కులు,ఎంక్వైరీ యాక్టు-1952కు విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొనడం ద్వారా కమిషన్‌ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్ధేశాలు బయటపడ్డాయన్నారు.

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఆ తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం బహిర్గతమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషన్‌ నివేదిక సహజ న్యాయసూత్రాలు, ప్రాథమిక హక్కులు,ఎంక్వైరీ యాక్టు-1952కు విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొనడం ద్వారా కమిషన్‌ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్ధేశాలు బయటపడ్డాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష సాధింపుతోనే తప్పుడు ఆరోపణలు చేసి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌కు అపకీర్తి తీసుకురావాలనే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిందని, మూడు బ్యారేజీలు, రిజర్వాయర్లు, లిఫ్ట్‌ వ్యవస్థలతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం కలిగి ఉందని వివరించారు. హైదరాబాద్‌కు తాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కేవలం మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలోని కొన్ని సాంకేతిక లోపా లను చూపిస్తూ మొత్తం ప్రాజె క్టును తప్పుబట్టడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పుడు ప్రచారాన్ని మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సాగునీరు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ ఠాకూర్‌ రఘు వీర్‌ సింగ్‌, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, కౌన్సిలర్‌ వెన్నం రవీందర్‌ సుజాత, నాయకులు వంగల తిరుపతిరెడ్డి, సంపత్‌, తానిపర్తి మోహన్‌ రావు, సందీప్‌ రావు, బైరెడ్డి రాంరెడ్డి, బోయిని రాజమల్లు, సలేంద్ర రాములు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజె క్టులో ఎలాంటి అవినీతి జరుగలేదని హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంప పెట్టు అని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ మోస పూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిందని, కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత గోదావరిని ఎండబెట్టి రైతులను ముంచివేసిందని ఆరోపిం చారు. ఏకపక్షంగా పీసీ ఘోష్‌ కమిషన్‌ వ్యవహరించిందని, 18నెలలు గా గోదావరిలో నీటి బొట్టు లేకుండా ఎండబెట్టిందని, 16నెలలుగా విచారణ పేరుతో వేధింపులకు గురిచేశారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కళ్లు తెరిచి కృంగిపోయిన పిల్లర్లను మరమ్మతు చేయించి రైతులకు నీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. మూల విజయారెడ్డి, మేకల సమ్మయ్య, గోపు ఐలయ్య, కల్వచర్ల కృష్ణవేణి, కవిత సరోజిని, సట్టు శ్రీనివాస్‌, దొమ్మేటి వాసు, పాలడుగుల కనకయ్య, కోడి రామకృష్ణ, వెంకటి పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అహంకారానికి హైకోర్టు తీర్పు పరాకాష్టగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు తర్వాత పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్ట్‌ పీసీసీ స్ర్కిప్ట్‌గా నిర్ధారిం చిందన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరువాలని ఆయన చెప్పారు. అనేక ఏండ్లుగా మూనేరు, గోదావరి నీళ్లు వృథాగా పోతున్నా ఈ ప్రాం త ఎమ్మెల్యేగా పరివాహక ప్రాంతాలకు నీళ్లు అందించాలని ఏనాడు ఆలోచన చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందరికి శ్రీరామరక్ష అని గ్రహించి ప్రాజెక్టు పునరుద్ధరణకు ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భూపాలపల్లి మాజీ జడ్పి చైర్మన్‌ జక్కు శ్రీహర్షిణి, రాజుగౌడ్‌, తగరం శంకర్‌లాల్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:11 AM